భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం మున్నేరు పరివాహ ప్రాంతాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరిశీలించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాలైన ప్రకాశ్‌నగర్ ప్రాంతంలోని మున్నేరు వంతెన వద్దకు చేరుకుని నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు.