*స్విగ్గీ, జమాటో రైడర్స్ సమస్యలు పరిష్కారం చేయాలి.* -సిఐటియు.అక్కయ్యపాలెం లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా. ఈ ధర్నాలో ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులు కే ఎం కుమార మంగళం అధ్యక్షులు బి జగన్ నాయకులు ఎం శ్రీనివాస్ అచ్యుత్ నాని అర్జున్, పెద్ద సంఖ్యలో రైడర్స్ పాల్గొన్నారు. స్విగ్గి జమాటో యాజమాన్యాలతో అనేక దఫాలు చర్చలు చేసాం లేబర్ కమిషనర్ కలెక్టర్ గారు జోక్యం చేసుకున్న సమస్యలు పరిష్కారం చేయట్లేదు. కాబట్టి ప్రతివారం వీకెండ్ శని ఆదివారాల్లో స్విగ్గీ, జమాటో ని బంద్ చేయాలని రైడర్స్ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని తప్పకుండా రైడర్స్ అందరూ అమలు చేయాla.