గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు పలు సూచనలను సైబరాబాద్ పోలీసులు వీడియో రూపంలో గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ నిమజ్జనం ప్రాంతంలో సూచించిన ప్రదేశాలలో నిమజ్జనం చేయాలని రోడ్లపై వెళుతున్న వాహనాలపై రంగులు చెల్లకూడదని అన్నారు. విగ్రహాలు ను అధికారులు నిర్దేశించిన మార్గంలోనే నిమజ్జనానికి తీసుకెళ్లాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.