నెల్లిమర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మండపాలను బుధవారం సాయంత్రం నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద అనుమతులు గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఉత్సవ నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం పలు గ్రామాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులను ఎస్ఐ గణేష్ పరిశీలించారు.