నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సాయంకాలం 5 గంటలకు అకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, ల్యాబ్, స్టాఫ్ హాజరు పట్టీలు, రోగుల రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సిబ్బంది హాజరు, సేవలపై ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న సేవలపై అభిప్రాయాలు సేకరించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య వివరాలు, టిబి, హెచ్ఐవి, ఫీవర్ సర్వే వంటి అంశాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.