వినాయక ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, నియమనిబంధనలు పాటించాలని రాయదుర్గం సిఐ జయానాయక్ తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి కోసం గణేష్ ఉత్సవ్. నెట్ లింక్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలని తెలిపారు. ఆ తర్వాత పోలీసు క్యూఆర్ కోడ్ డౌన్ లోడ్ చేసుకుని పోలీసు స్టేషన్ లో వివరాలు సమర్పించాలని వివరించారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పందిళ్ళ వద్ద ఎటువంటి డిజెలు ఉపయోగగించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.