ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య పగ్గాల రామలక్ష్మమ్మను భర్త పగ్గాల వెంకటేశ్వర్లు గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలాల నుంచి వెంకటేశ్వర్లు పరారయ్యాడు. స్థానికులు శుక్రవారం రాత్రి 9 గంటలకు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పొలానికి వెళ్ళిన క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని భర్త భార్యను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.