పాణ్యం మండల పరిధిలోని శైవ పుణ్యక్షేత్రమైన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయ తలుపులు మూసివేసినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు సురేశ్ శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.