నల్లగొండ జిల్లా కనగల్ మండల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం అన్నారు. శనివారం మండలంలోని పిహెచ్సి కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లు ఆసుపత్రి పరిసరాలు మందుల నిల్వలు రికార్డులను పరిశీలించారు.కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. రాత్రి సమయంలో వచ్చే రోగులకు ఓపికతో వైద్యం చేయాలని సూచించారు.తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో సుమలత ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ గాదరి రామకృష్ణ తదితరులు ఉన్నారు.