శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో వైసీపీ సమన్వయకర్త రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ నీలా దేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2008లో ప్రారంభించారు సుమారు 8 కోట్ల రూపాయలు వ్యయం చేసి అప్పటినుంచి సుమారు వెయ్యి ఎకరాలకి నీరు అందేది కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం చంద్రబాబునాయుడు పరిపాలనలో దాన్ని ఎటువంటి స్వస్థతలు లేకుండా చేయడం వల్ల అయిదు గ్రామాలకి నీరందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యవసాయమే దండగాని చంద్రబాబు నాయుడుకి రైతుల గోస వినపడదు అని అన్నారు.