కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం దొమ్మర నంద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాము కలకలం సృష్టించింది.స్కూల్ విరామ సమయంలో విద్యార్థులంతా స్కూల్ ప్రాంగణంలో ఉండగా విద్యార్థుల కాళ్ల మధ్య నుండి పాము రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. భయాందోళనలతో అటు ఇటు పరుగులు తీశారు. కమిటీ సభ్యులు ఇమామ్ హుస్సేన్ గమనించి పాము బారి నుండి విద్యార్థులను కాపాడారు. ఈ ఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.