మనుబోలు మండల కేంద్రం లో అంగన్వాడీ కేంద్రానికి సాగు నీటి సంఘం నేత పెనుబాక మహేష్ సొంత నిధులతో మరమ్మత్తులు చేశారు. తలుపులు లేక ఇబ్బంది పడుతుంటే కొత్త తలుపును బిగించారు అదేవిధంగా ప్యాను, కరెంట్ బిగించినారు చిన్నారులకు స్టేషనరీ పంపిణీ చేశారు. అంగన్వాడీ భవనం లేక ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరలొ పరిష్కరించేందుకు కృషి చేస్తామని బుధవారం ఉదయం 11 గంటలకు తెలిపారు. ఈ సమస్యపై ఐసిడిఎస్ వారితో కూడా చర్చిస్థామన్నారు.