శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టీ ఎస్ చేతన్ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. యూరియా స్టాక్ లభ్యతను పరిశీలించిన అనంతరం వరి సాగుకు అధిక నీటి అవసరం ఉంటుందని ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను ఆయన సూచించారు.