పత్తికొండ మండలంలోని హోసూరు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు గజ్జల వినూత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును శుక్రవారం పొందారు. విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.