మంగళవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన శ్రీజ హైదరాబాద్ లో బి టేక్ రెండో సంవత్సరం చదువుతుంది. ఆమె మట్టితో చేసే వినాయకుడు పర్యావరణ హితమే అయినా చెరువులు, నదుల్లో పూడిక పేరుకోవడానికి కారణమవుతుందని దానికి ప్రత్యామ్నాయం చూపాలనుకుని వేరుశనగ పొట్టు, వ్యవసాయ వ్యర్థాలతో విగ్రహాల తయారీ ప్రారంభించింది.వీటిని నిమజ్జనం చేస్తే జలచరాలకు ఆహారంగా సాయపడతాయి.