ఆర్టీఐ కింద తప్పుడు సమాచారం ఇచ్చిన ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని DYFI జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై సమాచారం కోరితే, తప్పుడు వివరాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆసిఫాబాద్ కలెక్టర్ కు పిర్యాదు చేసినట్లు తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.