పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్గీయ రాజశేఖర్ రెడ్డి వర్దంతిని, కాంగ్రెస్ శ్రేణులు వినూత్నంగా జరిపారు. అంబేద్కర్ విగ్రహంతోపాటు సర్గీయ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జలాలతో అభిషేకం చేసారు. మొదటగా నందిమేడారం రిజార్వయర్ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జలాలను, బిందెల ద్వార తీసుకు వచ్చి, ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలతో పాటు ఎల్లంపల్లి జలాలతో అభిషేకం చేసారు. ఆ తర్వాత అదే ఎల్లంపల్లి జలాలతో వైఎస్ఆర్ చిత్రపటానికి అభిషేకం చేసి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.