కుప్పంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. జయప్రకాశ్ రోడ్డుకు చెందిన లక్ష్మణమూర్తి కుటుంబం క్రిష్ణగిరి KRP డ్యామ్లో దూకింది. కుటంబ కలహాల నేపథ్యంలో లక్ష్మణ్ మూర్తి (50), అతని భార్య జ్యోతి (40), కుమార్తె కీర్తిక(20), జ్యోతి తల్లి శారదమ్మ (70) ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. వీరిలో లక్ష్మణమూర్తి, శారదమ్మ మృతి చెందగా జ్యోతి, కీర్తికను జాలర్లు రక్షించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.