తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత..స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్రీడల ప్రియుడని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ 3వ సారి నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు మరియు కరాటే పోటీలకు ముఖ్యతిథులుగా సుడా చైర్మన్, జూడో అసోసియేషన్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ హాజరయ్యి పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఆడపిల్లలకు ఆత్మరక్షణ నిమిత్తము కుంగ్ ఫు శిక్షణ అందరికి అవసరము కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు.