మామిడికుదురు మండలం పాసర్లపూడిబాడవలో శనివారం రక్తపింజర కలకలం సృష్టించింది. మోకా విజయరాజుకు చెందిన వంటపాకలో రక్తపింజర కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. దాన్ని కొట్టి చంపగా దాని పొట్టలో నుంచి 14 పిల్లలు బయటపడ్డాయని స్థానికులు తెలిపారు. ఇటీవల కాలంలో రక్త పింజర్ల బెడద తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.