కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నేరం నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జీడిమెట్ల సీఐ మల్లేష్ సూచన మేరకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలు ఉత్తమ గణేష్ మండపాలలో 102 కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. నిమజ్జనాల అనంతరం బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జీడిమెట్ల పోలీసులకు ఈ కెమెరాలను అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.