సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని లోకకల్యాణం కోసం సామూహిక యజ్ఞ విశేష పూజలు నిర్వహించామని ప్రముఖ యోగ గురువులు యోగానంద గురూజీ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ అమ్మ స్పటిక అమరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశ్రమంలో సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు