విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కొత్త పేటలో గల మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు ఇటీవలే జరిగిన సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం అయ్యాయని, త్వరలో చండీఘర్ లో జాతీయస్థాయి మహాసభలు జరుగునున్నట్లు తెలిపారు. మీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి, చైతన్య పాల్గొన్నారు.