నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ సమీపంలో గల సరస్వతి కాలువకు గురువారం సాయంత్రం గండి పడింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో సరస్వతి కాలువ కోతకు గురైంది. దీంతో గండి పడి వరద నీరు మొత్తం పక్కన గల పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. ఈ విషయాన్ని రైతులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సరస్వతి కాలువకు మరమ్మత్తులు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా విన్నవిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.