తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయానికి సమీపంలో సత్యా షాపింగ్ మాల్ పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ గురువారం రాత్రి ఆకస్మికంగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఒక్కసారిగా పెద్ద మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాన్స్ఫార్మర్ పేలుడు కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.