ఆనందోత్సవాల నడుమ రాయచోటిలో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. సోమవారం సాయంత్రం 6వ రోజు నిమజ్జనోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాయిద్యాల నడుమ బాణసంచా కాల్చుతూ, రంగులు చల్లుకుంటూ యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.