శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారం తగ్గించాలని, ప్రభుత్వా సెలవులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు.