చిత్తూరు: డాక్టర్లపై దాడి చేసిన ఆరుగురిపై కేసు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై జరిగిన దాడిలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య శనివారం తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స విషయమై రేగిన వివాదం కారణంగా షరీఫ్, లోకేష్, యశ్వంత్, వినేష్, సందీప్ డాక్టర్ మనోజ్ కుమార్పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.