పాడేరు ఐటిడిఏ పరిధిలో గల 117 ఆశ్రమ పాఠశాలల నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సూపర్ 50 అనే ప్రత్యేక కార్యక్రమంలో కోచింగ్ ఏర్పాటు చేయుట కొరకు జిల్లా వ్యాప్తంగా మూడు పాఠశాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లాలో తలారసింగి ఆశ్రమ పాఠశాలలో 168 విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. లోచలిపుట్టు పాఠశాలలో 140 మంది, శ్రీకృష్ణాపురం బాలికల పాఠశాలలో 230 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. వీటిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు చింతపల్లి మరియు పాడేరు రెండు సెంటర్లుగా విడదీసి ప్రత్యేక బోధనా తరగతులు అందిస్తామని ఇన్చార్జి ITDA పిఓ అభిషేక్ తెలిపారు