ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఆగస్టు నెలలో కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి పలుమార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదని వైసీపీ సభ్యులు కమిషనర్ రవిచంద్ర రెడ్డి ని ప్రశ్నించారు. తాను కలెక్టర్ కార్యాలయంలో ఉన్నందువలన ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని కమీషనర్ సమాధానం చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే చైర్పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని కమీషనర్ చైర్పర్సన్ కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కౌన్సిల్ సభ్యులు కింద కూర్చొని నిరసనకు దిగారు. కమిషనర్ క్షమాపణ చెప్పే వరకు నిరసన విరమించబోమని కౌన్సిల్ సభ్యులు పట్టు