స్వచ్ఛరధం పేరుతో వినూత్న పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో స్వచ్ఛ రథం ఇంటింటికీ తిరుగుతూ ఇళ్లలో పనికిరాని వస్తువులను సేకరించి వాటికి బదులు నిత్యవసర సరుకులను గాని నగదును గాని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది.