కణేకల్లు మండల కేంద్రంలోని కోరమాండల్ ఫర్టిలైజర్ షాప్ మంగళవారం ఉదయం రైతులు యూరియా దొరక్క పోవడంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ బ్రహ్మయ్య, మండల వ్యవసాయాధికారి జగదీష్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆప్ఫటికే గంటల తరబడి వేచిచూసి ఓపిక నశించిన రైతులు అధికారులను గట్టిగా నిలదీశారు. 250 క్వింటాళ్ల స్టాక్ వచ్చిందంటారు తీరా చూస్తే ఎవరికి ఇచ్చారో అర్దం కావడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు ఏంచేయాలో తోచక తికమకపడ్డారు.