మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ పదవిని తిరస్కరించారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు పాలకొల్లులో ఆయన కార్యాలయంలో అంగర మాట్లాడారు. కార్యకర్త స్థాయి నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ల పనిచేసిన తనకు డైరెక్టర్ పదవి ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్లకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశానని, చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.