Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలం, ఆదురుపల్లి సచివాలయంలో హౌసింగ్ ఏఈ ప్రకాష్ సోమవారం ఇళ్ల పట్టా లబ్ధిదారులతో సమావేశమయ్యా రు. గ్రామంలోని ఆదురమ్మ గుడి వద్ద గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను గుర్తుచేస్తూ, ఇల్లు కట్టుకోవాలనుకుంటే స్వయంగా కట్టుకోవచ్చని లేదా ప్రభుత్వం కట్టిస్తుందని తెలిపారు. మొత్తం 19 మంది అర్హులను గుర్తించినట్లు తెలిపారు. బుధవారం నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.