గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో గోదావరి పుష్కరాలు నిర్వహణకు శాఖల వారిగా చేయాల్సిన ఏర్పాట్లుపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, అగ్నిమాపక, వైద్య, ఆర్టీసీ, విద్యుత్తు, ఉద్యాన, ఆర్ అండ్ బి, మహిళా సంక్షేమ, జాతీయ రహదారులు, మత్స్య, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని