పర్యావరణ పరి రక్షణ అందరి బాధ్యతని కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ప్రతిస్టద్ధాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే పోస్టర్స్ ను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం కావడం ద్వారా అనేక వాతావరణ మార్పులు చెంది ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. కావున పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అన్నారు.రాబోవు వినాయక చవితి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలన్నారు.