భారతీయ జనతా పార్టీ జగిత్యాలజిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారంమధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రజావాణి సందర్బంగా జిల్లా కలెక్టర్ కు జగిత్యాల జిల్లా స్థానిక సమస్యలపై బీజేపీ నాయకులు ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మరియు పట్టణ అధ్యక్షుడు కొక్కుగంగాధర్ జిల్లా నాయకులు పట్టణ నాయకులు జిల్లా, పట్టణ మహిళా విభాగం నాయకురాళ్ళు వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.