ఆర్టీసి బస్సులో వెళుతున్న ఓ మహిళను ఏమార్చి సుమారు 15 తులాల బంగారు నగలు అపహరించిన ఉదంతం శనివారం సాయంత్రం కణేకల్లులో చోటు చేసుకుంది. కణేకల్లు కకు చెందిన యశోద అనే మహిళ కళ్యాణదుర్గం నుంచి కణేకల్లు కు శనివారం సాయంత్రం వచ్చింది. ఆమె ఒంటిపై ఉన్న నగలు బస్సులో ఎవరైనా దొంగలిస్తారేమేనని పాకెట్ లో ఉంచుకుని ప్రయాణం చేసింది. కణేకల్లు బస్టాండ్ లో బస్సు దిగే సమయంలో ఆమెను ఏమార్చి ఆ నగల పాకెట్ ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ మధు ల ఆధ్వర్యంలో ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలలను రంగంలోకి దింపారు.