Parvathipuram, Parvathipuram Manyam | Aug 29, 2025
ఎస్సీ వర్గీకరణతో దళితుల ఐక్యతపై బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వాములుగా ఉన్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక రైతు బజారు వద్ద గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాల వర్గంపై కక్ష గట్టాయన్నారు.