కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 'రైతు పోరు' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పిఠాపురం మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబి సోమవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతులకు కనీసం ఎరువులు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు