ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యమని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వీరేష్ బుధవారం తెలిపారు. జిల్లా అయితే ఇక్కడ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు వస్తే ఇక్కడ వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. అదేవిధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుంది అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వలసలకు వెళ్తున్నారు అన్నారు. ఆదోని జిల్లా చేయాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.