బీర్పూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపంలో,సారంగాపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ లో బీర్ పూర్, సారంగాపూర్ మండలం లోని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతుదారుల ముఖ్య సమావేశం మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తున్నానాన్నారు.స్తానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.