మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వేను సోమవారం పూర్తిగా మూసివేశారు. కాజ్వేపై నాలుగు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వరద నీటిలో దిగరాదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్పనపల్లికి ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. పాశర్లపూడి శ్రీరామ్ పేటకు వెళ్లే రోడ్డు ముంపునకు గురైంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.