నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీ సమీపంలో ఆగి ఉన్న లారీ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.లారీ క్యాబిన్ దగ్ధం అయింది. సకాలంలో స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు