ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోవ లక్ష్మి రెబ్బెన మండలానికి చెందిన 17 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.