మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మూడో జోన్ లో చెందిన ఓ యువకుడు రూ.50 వేల లోన్ కోసం ఓ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నాడు. లోన్ కావాలంటే తాము చెప్పినట్లు చేయాలని సైబర్ మోసగాళ్లు నమ్మించారు. అతడి ఆధార్, పాన్ కార్డుల వివరాలను సేకరించి, ఛార్జీల పేరుతో రూ.37,500 కొట్టేశారు. తర్వాత లోన్ మంజూరు కాకపోవడంతో మోసపోయినట్లు గమనించినా బాధితుడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.