రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. జిల్లా కోర్టు లోని న్యాయ సేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నిర్వహించారు.