రాయదుర్గం పట్టణంలో మారెమ్మ జాతరలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో కొలువైన అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. సాయంత్రం పట్టణంలోని కోట మారమ్మ, దండు మారెమ్మ, పెద్దమారెమ్మ ఆలయాలకు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ఆయా ఆలయాల వద్ద నిర్వహించిన సిడి మహోత్సవం తిలకించేందుకు వేలాది మంది తరలిరావడంతో ఆ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.