కాట్రేనికోన మండలం, చెయ్యేరు పంచాయతీ పరిధి చెయ్యేరు అగ్రహారం ప్రధాన రహదారిపై రెండు ఆంబోతులు హోరాహోరీగా తలపడ్డాయి. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ఈ పోరాటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎవరి మీద పడతాయో అని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా అవి పోట్లాట ఆపలేదు. కాసేపటికి అవి తమ దారిన అవి వెళ్లిపోవడంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.