ఆళ్లగడ్డ మండలం లోని పలు గ్రామాలలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆళ్లగడ్డ లోని కోర్టు ఆవరణలో భారీ వృక్షం విద్యుత్ తీగల పైకి ఒరిగి పోవడంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు అభ్యర్థన మేరకు స్థానిక శారద శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు దురుగడ్డ రవీంద్రచారి క్రేన్ ను పంపడంతో క్రేన్ సహాయంతో చెట్ల కొమ్మలను గురువారం తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది లైన్లు మరమ్మత్తులు చేపట్టారు.